Share News

ABN Andhrajyothy: పోటాపోటీగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముగ్గుల పోటీల ఫైనల్స్

ABN , Publish Date - Jan 13 , 2026 | 08:45 AM

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై: సన్ ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్ వాసి అగరబత్తి) హైదరాబాద్లో అంగరంగ వైభవంగా సోమవారం జరిగాయి. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళలు అందరూ పోటాపోటీగా రంగవల్లులను తీర్చిదిద్దారు.

ABN Andhrajyothy: పోటాపోటీగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముగ్గుల పోటీల ఫైనల్స్
ABN Andhrajyothy

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (ABN Andhrajyothy Mutyala Muggulu) (పవర్డ్ బై: సన్ ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్ వాసి అగరబత్తి) హైదరాబాద్లో అంగరంగ వైభవంగా సోమవారం జరిగాయి. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన మహిళలు అందరూ పోటాపోటీగా రంగవల్లులను తీర్చిదిద్దారు. సంప్రదాయాలను తెలియజేస్తూ వారు తీర్చిదిద్దిన ముగ్గులతో సంక్రాంతి శోభవెల్లివిరిసింది. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, శతమానం భవతి సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి.సృజన ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రతీ ముగ్గును పరిశీలించి పోటీదారులను అభినందించడమే కాకుండా అందరితోనూ ఫొటోలు దిగుతూ సందడి చేశారు.

MUGGULU-90.jpg

MUGGULU-11.jpg


» ఉత్సాహంగా పాల్గొన్న రాష్ట్రంలోని 33 జిల్లాల విజేతలు

» ప్రథమ స్థానంలో ఖమ్మం మహిళ

» నలుగురికి ద్వితీయ, 28 మందికి కన్సోలేషన్ బహుమతులు

» ముఖ్య అతిథిగా హాజరైన సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్. సతీశ్ వేగేశ్న ఐఏఎస్ అధికారిణి సృజన

హైదరాబాద్ సిటీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ''ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ జై సన్ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తీ) ఫైనల్స్ సోమవారం అమీర్‌పేట మునిసిపల్ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి గెలిచిన 33 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన నటకిరీటి రాజేంద్రప్రసాద్, శతమానం భవతి' సినిమా దర్శకుడు సతీశ్ వేగేశ్న, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి.సృజన ప్రాంగణంలో కలియదిరిగి ముగ్గుల చుక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగవల్లులోని సందేశా త్మక వ్యాఖ్యానాలకు ముగ్ధులయ్యారు. పోటీల్లో ఖమ్మం జిల్లా మహిళ ఎల్. విజయకుమారి ప్రథమ స్థానంలో నిలిచారు.

MUGGULU-4.jpg


ఆమెకు రాజేంద్రప్రసాద్ తన చేతుల మీదగా రూ.30వేల చెక్కు అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జె. అశ్విని( ఆదిలాబాద్), వి.దివ్య (నల్లగొండ), బి. విజయలక్ష్మి (మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా), శిల్పారెడ్డి (మహబూబ్‌నగర్)కి తలా రూ. పదివేల చెక్కును బహూకరించారు. మిగతా 28మంది పోటీదారులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పోటీదారులు పరిచిన 33ముగ్గులను చూస్తుంటే తనకు తెలంగాణలోని ప్రతి జిల్లాను చుట్టొచ్చినంత సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 'ఆంధ్రజ్యోతి- ఏబీఎన్' వారు తమను పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా చూసుకుంటున్నారని ఓ మహిళ తనతో చెప్పారని, అది ఈ సంస్థల నిబద్ధతకు నిదర్శనమని ఉద్ఘాటించారు.

MUGGULU-7.jpg


శతమానం భవతి సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ముత్యాల ముగ్గులను చూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఈ ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి ముందే వచ్చినంత సంబురంగా ఉందని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి. సృజన పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వక్కలంక రమణ మాట్లాడుతూ... ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ 16 ఏళ్లుగా ముత్యాల ముగ్గుల పోటీని దక్షిణాది స్థాయిలో నిర్వహిస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మొత్తం 81కేంద్రాల్లో ముగ్గుల పోటీ నిర్వహించినట్లు వెల్లడించారు.

MUGGULU-10.jpg


హిందూపురంలో 600మంది పోటీదారులు పాల్గొనడం 'ఆంధ్రజ్యోతి -ఏబీఎన్' ముత్యాల ముగ్గులపోటీకి వస్తున్న అమితా దరణకు నిదర్శనమన్నారు. ఈ ఏడాది తెలంగాణలోని ప్రతిజిల్లా నుంచి ఫైనల్స్‌కు విజేతలను ఆహ్వానించినట్లు వివరించారు. ముగ్గుల పోటీకి బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ పి. రజని, ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణురాలు పారిజాత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పరిమళ్ భారత్ అగరబత్తీ తెలంగాణ, ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్ ఇ. సతీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు హాజరయ్యారు.

MUGGULU.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 10:21 AM