Share News

NIA Raids : గాదె ఇన్నయ్య అనాథాశ్రమంలో ఎన్‌ఐఏ సోదాలు.. వాటిపై ఫోకస్..

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:20 AM

జనగామ జిల్లాలోని జాఫర్‌ఘడ్‌లో సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..

NIA Raids : గాదె ఇన్నయ్య అనాథాశ్రమంలో ఎన్‌ఐఏ సోదాలు.. వాటిపై ఫోకస్..
NIA Raids

జనగామ జిల్లా, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు (Gadde Innaiah) చెందిన జాఫర్‌ఘడ్ ప్రాంతంలోని మాఇల్లు అనే పేరుతో ఉన్న అనాథశ్రమంలో ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు (NIA) సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచే ఎన్ఐఏ అధికారులు బృందాలుగా విడిపోయి.. ఆశ్రమంలోని రికార్డులు, కంప్యూటర్లు, ఇతర పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎన్ఐఏ సోదాలు చేస్తుండటంతో మీడియా ఆ ప్రాంతానికి చేరుకుంది. అయితే సోదాలు జరుగుతున్న సమయంలో సమాచారం బయటకు రాకుండా మీడియాను లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


ఇన్నయ్య అరెస్ట్, కేసు వివరాలు..

ఇన్నయ్యను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న ఇన్నయ్యను ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగానే ఇన్నయ్యకు సంబంధించిన అనాథాశ్రమంలో జరిగే కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తదితరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. ఎన్ఐఏ అధికారులు ఒక అనాథాశ్రమంపై దృష్టి సారించడం, 'ఉపా' (UAPA) చట్టం కింద చర్యలు తీసుకోవడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత..

పోలవరం నల్లమల సాగర్ లింక్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 13 , 2026 | 11:09 AM