Share News

Road Accident: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ABN , Publish Date - Jan 18 , 2026 | 09:41 AM

సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేద్దామని స్వగ్రామానికి వచ్చి తిరుగు పయనంలో హైదరాబాద్‌ వెళ్లే క్రమంలో ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాలలోని పోరండ్ల సమీపంలో విద్యుత్ పోల్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకుల మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident: జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
Porandla Accident

జగిత్యాల జిల్లా, జనవరి 18: సంక్రాంతి పండుగ సెలవుల్లో సొంతూరికి వచ్చిన ముగ్గురు యువకులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్‌లో చదువుకుంటున్న నవనీత్, సాయి తేజ, సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వెళ్లారు. శనివారం రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి పోరండ్ల వద్ద పార్టీ చేసుకుని, హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా వారి కారు అతి వేగంతో వెళ్లి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజలు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. సృజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తు, అతి వేగం వంటి కారణాలు ప్రమాదానికి దారితీశాయని ప్రాథమికంగా అంచనా వేశారు. సంక్రాంతి వంటి పండుగల సమయంలో రోడ్లపై ట్రాఫిక్ పెరగడంతో పాటు, సరైన జాగ్రత్త పాటించకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదంతో.. బాధిత యువకుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. పండుగ వేళలో ఇలాంటి విషాదకర ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..

మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 10:21 AM