Share News

Mauni Amavasya 2026: మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:56 PM

పుష్య మాసం మరికొద్ది రోజుల్లో.. అంటే అమావాస్యతో ముగియనుంది. ఈ మాసంలో వచ్చే అమావాస్యను.. మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఏం చేయాలనే విషయాన్ని పురాణాలు వివరిస్తున్నాయి.

Mauni Amavasya 2026: మౌని అమావాస్య ఎప్పుడు?.. ఆ రోజు ఏం చేయాలి..
Mauni Amavasya

సంక్రాంతి, కనుమ, ముక్కనుమ తర్వాత వచ్చేది మౌని అమావాస్య. అదీకాక ఈ మౌని అమావాస్య.. ఆదివారం (18-01-2025) వచ్చింది. ఆదివారం అమావాస్య అంటే ఆ రోజు మంచిదేనా అంటూ అందరు పలు సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ అమావాస్య మంచిదా? కాదా?. మంచిది అయితే అసలు ఆ రోజు ఏం చేయాలి అనే సందేహాలు వ్యక్తమవుతాయి. ఈ రోజు చాలా పుణ్య తిథి.. పుణ్య నదుల్లో స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదిలితే వారికి సద్గతులు సంప్రాప్తిస్తాయని పురణాలు చెబుతున్నాయి.


ఇంతకీ మౌని అమావాస్య ఎప్పుడు?

ఈ ఏడాది జనవరి18వ తేదీన ఈ అమావాస్య వస్తుంది. ఆ రోజు అమావాస్య జనవరి 18వ తేదీ ఉదయం 12.03 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జనవరి 19వ తేదీ తెల్లవారుజామున 1.21 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఏ తిథి ఉంటుందో దానినే హిందూ సంప్రదాయం ప్రకారం అనుసరిస్తారు. అందువల్ల మౌని అమావాస్య.. జనవరి 18వ తేదీన వస్తుంది.


ఈ రోజు ఏం చేయాలి..

  • బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి.. భూమాతకు నమస్కారించాలి. పుణ్య స్నానం ఆచరించాలి. స్నానం అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

  • శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.

  • శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిన చేసి.. శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. కాలభైరవుడిని పూజించాలి.

  • మౌన వ్రతం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది.

  • ఈ అమావాస్య రోజు.. మౌన వ్రతం పాటించడం వల్ల పుణ్యం లభిస్తుంది. మనస్సులో భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల శక్తి అధికమవుతుంది.


  • ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా బిక్షాటనకు వస్తే.. వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకూడదు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి.

  • పితృదేవతల పేర్లు చదువుతూ మూడుసార్లు నువ్వులు, నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి.

  • ఓం పితృ దేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.

  • ఉపవాస దీక్ష ఆచరించినా మంచిదే. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి.

  • శక్తిని బట్టి దానం ఇవ్వాలి.

  • ఈ రోజు సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.


ఈ అమావాస్య రోజు.. చేయకూడని పనులు

  • ఈ రోజు స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు. మౌని అంటే మౌనం అని అర్థం.

  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి.. సంకల్పం చెప్పుకోవాలి.

  • ఈ రోజు శాంతంగా ఉండాలి. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. ఎవరితో వాదన పెట్టుకోకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు.


  • పేదలు, నిస్సహాయంగా ఉన్న వారిని అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆగ్రహానికి గురవుతారు.

  • మౌని అమావాస్య రోజు.. నిర్జన ప్రదేశాలు, స్మశానవాటికల వైపు వెళ్లవద్దు. అలాగే మర్రి చెట్టు వద్దకు వెళ్లవద్దు. ఎందుకంటే ఆ చెట్టు వద్ద ప్రతికూలశక్తులు ఉంటాయి.

  • ఈ మౌని అమావాస్య రోజు.. పొరపాటున ఎవ్వరినీ మోసం చేయవద్దు. ఈ రోజు మీరు ఏదైనా తప్పు చేస్తే.. పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతికి ఈ ఆలయాలు దర్శిస్తే.. జీవితమే మారిపోతుంది!

గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..

For More Devotional News And Telugu News

Updated Date - Jan 15 , 2026 | 07:04 PM