Share News

Sankranti Visit These Temples: సంక్రాంతికి ఈ ఆలయాలు దర్శిస్తే.. జీవితమే మారిపోతుంది!

ABN , Publish Date - Jan 14 , 2026 | 03:03 PM

ఈ సంక్రాంతికి మీ జాతకం మారాలనుకుంటున్నారా?. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రోజున ఏ ఆలయాలు దర్శిస్తే జీవితం మారిపోతుందో తెలుసుకుందాం..

Sankranti Visit These Temples: సంక్రాంతికి ఈ ఆలయాలు దర్శిస్తే.. జీవితమే మారిపోతుంది!
Sankranti Visit These Temples

ఇంటర్నెట్ డెస్క్: సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సంక్రాంతి పర్వదినం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన సమయం. ఈ రోజు దైవ దర్శనం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే, సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు వెళ్లడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. మరి ఈ సంక్రాంతికి తప్పక వెళ్లాల్సిన ఆలయాలు ఏవో తెలుసుకుందాం..


అరసవిల్లి సన్ టెంపుల్

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధమైన సూర్య క్షేత్రం. సంక్రాంతి నాడు ఇక్కడ స్వామివారిని దర్శిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

Arasavalli (1).jpg

తిరుమల టెంపుల్

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సంక్రాంతి రోజున దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగాల్లో పురోగతి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని విశ్వసిస్తారు. కొత్త ఆరంభాలకు సంక్రాంతి, తిరుమల దర్శనం మంచి సంకేతంగా భావిస్తారు.

Tirumala.jpg


శ్రీశైలం

శివ భక్తులకు శ్రీశైలం ప్రత్యేక స్థానం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రంలో సంక్రాంతి రోజున శివాభిషేకం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కుటుంబ సమస్యలు, మనసుకు కలిగే అశాంతి తొలగిపోవాలనుకునేవారికి శ్రీశైలం దర్శనం మంచిదని భావిస్తారు.

srisailam.jpg

యాదాద్రి క్షేత్రం

తెలంగాణలోని యాదాద్రి క్షేత్రం సంక్రాంతి రోజుల్లో భక్తులతో కిటకిటలాడుతుంటుంది. నరసింహ స్వామిని ఈ రోజు దర్శిస్తే భయాలు తొలగిపోతాయని, శత్రు బాధలు తగ్గుతాయని నమ్మకం. గ్రహ దోషాలు, మానసిక ఒత్తిడి ఉన్నవారు యాదాద్రి వెళ్లడం శుభప్రదంగా భావిస్తారు.

Yadadri (1).jpg


బాసర

పిల్లల చదువు, భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎక్కువగా వెళ్లే క్షేత్రం బాసర. గోదావరి తీరంలో ఉన్న ఈ సరస్వతి దేవాలయంలో సంక్రాంతి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి విద్యాభ్యాసం కలుగుతుందని నమ్మకం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఆశాజ్యోతి.

Basara.jpg

అన్నవరం టెంపుల్

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి. సంక్రాంతి నాడు సత్యనారాయణ వ్రతం చేస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని, కుటుంబంలో ఐక్యత పెరుగుతుందని విశ్వాసం. కొత్త దంపతులు, కుటుంబంతో కలిసి వెళ్లేవారికి ఇది ఎంతో అనుకూలమైన క్షేత్రం.

Annavaram.jpg

సంక్రాంతి సెలవుల కారణంగా ఈ ఆలయాలన్నింటిలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ముందుగానే దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం, వృద్ధులు, చిన్నపిల్లలతో వెళ్లేవారు తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో దర్శనం ప్లాన్ చేసుకోవడం మంచిది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..

పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.. దీని వెనుక ఉన్న కథ ఇదే..

For More Latest News

Updated Date - Jan 14 , 2026 | 05:01 PM