Share News

Hyderabad Gets General Woman Mayor: జనరల్‌ మహిళకు హైదరాబాద్‌!

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, 121 మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయించారన్న వివరాలను బుధవారమే ప్రకటించిన ప్రభుత్వం..

Hyderabad Gets General Woman Mayor: జనరల్‌ మహిళకు హైదరాబాద్‌!

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, 121 మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏయే కేటగిరీలకు ఎన్ని స్థానాలు కేటాయించారన్న వివరాలను బుధవారమే ప్రకటించిన ప్రభుత్వం.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఏయే రిజర్వేషన్‌ వర్తిస్తుందన్న వివరాలను శనివారం వెల్లడించింది. మున్సిపల్‌ చట్టం ప్రకారం ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు పురపాలక శాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించిన అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, పోలింగ్‌ కేంద్రాల వారీగా తుది ఓటరు జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. సంబంధిత సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదు చేశారు. పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం వంటి ప్రక్రియలూ పూర్తయ్యాయి. తాజాగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వివరాలను ఎన్నికల సంఘానికి ఒకట్రెండు రోజుల్లో అందజేయనుంది. ఆ వెంటనే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసి ప్రకటించనుంది.

3 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు తర్వాతే

రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉండగా.. ప్రస్తుతం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తవలేదు. దానితో గడువు ముగిశాక వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక నకిరేకల్‌, సిద్దిపేట, కొత్తూరు., జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకూ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.

మేయర్‌ పదవుల రిజర్వేషన్‌ ఇదీ..

కొత్తగూడెం-ఎస్టీ జనరల్‌, రామగుండం-ఎస్సీ జనరల్‌, మహబూబ్‌నగర్‌-బీసీ మహిళ, మంచిర్యాల- బీసీ జనరల్‌, కరీంనగర్‌-బీసీ జనరల్‌, ఖమ్మం- మహిళ జనరల్‌, నల్గొండ - మహిళ జనరల్‌, నిజామాబాద్‌ - మహిళ జనరల్‌, జీహెచ్‌ఎంసీ - మహిళ జనరల్‌, గ్రేటర్‌ వరంగల్‌ - ఓపెన్‌ జనరల్‌


మున్సిపాలిటీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఇవీ..

ఎస్టీ జనరల్‌: కల్లూరు, భూత్పూర్‌, మహబూబాబాద్‌

ఎస్టీ మహిళ: కేసముద్రం, యెల్లంపేట

ఎస్సీ జనరల్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌, జమ్మికుంట, డోర్నకల్‌, లక్సెట్టిపేట్‌, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్‌, కోహిర్‌, హుస్నాబాద్‌

స్సీ మహిళ: చొప్పదండి, హుజూరాబాద్‌, ఏదులాపురం, గడ్డపోతారం, ఇంద్రేశం, చేర్యాల, వికారాబాద్‌, మోత్కూర్‌

బీసీ జనరల్‌: జనగామ, భూపాలపల్లి, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్‌, బిచ్కుంద, ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి, మద్దూరు, మంథని, వేములవాడ, షాద్‌నగర్‌, జిన్నారం, జహీరాబాద్‌, గుమ్మడిదల, సిద్దిపేట, హుజూర్‌నగర్‌, తాండూరు

బీసీ మహిళ: జగిత్యాల, ఇల్లందు, కామారెడ్డి, బాన్సువాడ, కాగజ్‌నగర్‌, దేవరకద్ర, చెన్నూర్‌, మెదక్‌, ములుగు, కొల్లాపూర్‌, అచ్చంపేట, దేవరకొండ, గజ్వేల్‌, దుబ్బాక, పరిగి, కొత్తకోట, ఆత్మకూరు, నర్సంపేట, ఆలేరు

మహిళ జనరల్‌: ఆదిలాబాద్‌, అశ్వారావుపేట, కోరుట్ల, ధర్మపురి, గద్వాల, సత్తుపల్లి, వైరా, మధిర, మరిపెడ, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, రామాయంపేట, నర్సాపూర్‌, తూప్రాన్‌, ఆలియాబాద్‌, కల్వకుర్తి, మిర్యాలగూడ, చిట్యాల, నారాయణపేట, నిర్మల్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌, సిరిసిల్ల, సదాశివపేట, సంగారెడ్డి, ఇస్నాపూర్‌, కోదాడ, వనపర్తి, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పల్‌

ఓపెన్‌ జనరల్‌: పరకాల, రాయికల్‌, మెట్‌పల్లి, ఎల్లారెడ్డి, జడ్చర్ల, తొర్రూర్‌, చండూర్‌, నకిరేకల్‌, హాలియా, కోస్గి, మక్తల్‌, ఖానాపూర్‌, భైంసా, బోధన్‌, సుల్తానాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్‌, కొత్తూరు, నారాయణ్‌ఖేడ్‌, ఆందోల్‌-జోగిపేట, సూర్యాపేట, తిరుమలగిరి, నేరేడుచర్ల, కొడంగల్‌, అమరచింత, పెబ్బేరు, వర్ధన్నపేట, పోచంపల్లి

Updated Date - Jan 18 , 2026 | 05:23 AM