MLA Defection Case: పార్టీ ఫిరాయింపు కేసు.. ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్..
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:30 PM
బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (శనివారం) చేపట్టిన విచారణ ముగిసింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు.. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించారు. ఇవాళ ఉదయం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో విచారణ కొనసాగింది. ఈనెల 1వ తేదీన జగరగాల్సిన విచారణ వాయిదా పడటంతో.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు విచారణకు హాజరయ్యారు.
బీఆర్‌ఎస్‌లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో సుప్రీకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గడువు విధించింది. ఈ మేరకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ వివరణ ఇచ్చారు. ఫిర్యాదుదారులు వారు పార్టీ మారని వారికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించారు. దీనిలో భాగంగా పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యేల విచారణలు ముగిసిన అనంతరం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ