Share News

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:38 PM

రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్‌ మండిపడ్డారు.

Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్‌ సీఎం

- కుంభకర్ణుడి తరహాలో రాష్ట్ర ప్రభుత్వం

- సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయం: ప్రతిపక్షనేత అశోక్‌

బెంగళూరు: రాష్ట్రంలో వరదలతో పది జిల్లాలు అతలాకుతలమయ్యాయని వారిని ఆదుకునే విషయంలో రాష్ట్రప్రభుత్వం కుంభకర్ణుడి తరహాలో నిద్రపోతోందని ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) మండిపడ్డారు. శుక్రవారం బెళగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు జిల్లాల్లో వరదలతో ఇల్లు, ఆస్తులు కోల్పోయారన్నారు. ప్రభుత్వానికి వారికష్టం కంటే కులగణన మీదే ఆసక్తి పెరిగిందన్నారు.


కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కుట్ర పన్నుతున్నారన్నారు. సిద్దరామయ్య(Siddaramaiah) అవుట్‌గోయింగ్‌ సీఎం అన్నారు. నవంబరు లేదా డిసెంబరులో రాష్ట్రంలో సంచలన రాజకీయాలకు తెరలేస్తుందన్నారు. నవంబరులో క్రాంతి చోటు చేసుకుంటుందని వ్యాఖ్యలు చేసిన మంత్రి రాజణ్ణ పదవిని కోల్పోయారన్నారు.


pandu1.2.jpg

ముఖ్యమంత్రి మార్పు తథ్యమన్నారు. రాజకీయంగా ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా జేడీఎ్‌స-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదన్నారు. ఆపరేషన్‌ కమల చేసేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు పుష్కలంగా వీస్తున్నాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 01:41 PM