Share News

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:26 PM

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌(ఐటీఐ)లు ఆత్మనిర్భర్ భారత్‌కు కీలకమైన వర్క్‌షాప్‌లని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇవి పారిశ్రామిక విద్యా సంస్థలు మాత్రమే కాదని, దేశంలోని యువతకు ఒక దిక్సూచీలని మోదీ అన్నారు.

PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ
PM-SETU Scheme Launch

ఢిల్లీ, అక్టోబర్ 4: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు (ఐటీఐ) ఆత్మనిర్భర్ భారత్‌కు కీలకమైన వర్క్‌షాప్‌లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఐటీఐలు పారిశ్రామిక విద్యా సంస్థలు మాత్రమే కాదు.. ఆత్మనిర్భర్ భారత్‌కు వర్క్‌షాప్‌లని చెప్పారు. ఈ సందర్భంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన యువత-కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని ఇవాళ(శనివారం) ఢిల్లీలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. యువతలో స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ.60,000 కోట్లతో ప్రవేశపెట్టారు.


దేశంలో 2014 వరకు 10,000 ఐటీఐలు ఉండగా, గత దశాబ్దంలో 5,000 కొత్తగా ఐటీఐ కళాశాలలు ఏర్పాటు చేశారని, ఈ 11 సంవత్సరాల్లో 1.5 కోట్ల మంది యువకులకు స్థానిక భాషల్లో స్కిల్స్ శిక్షణ ఇచ్చారని మోదీ తెలిపారు. యువత సాధికారతకు మెగా ప్రోగ్రామ్‌గా ఈ ఈవెంట్‌ను ప్రధాని వర్ణించారు. 'శ్రమేవ జయతే, శ్రమేవ పూజ్యతే' అని ఉటంకిస్తూ, స్కిల్డ్ వ్యక్తులను గౌరవించాలని ప్రధాని సూచించారు.

అటు, బిహార్‌లోనూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యువత సాధికారతను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు. నిశ్చయ్ స్వయం సహాయతా భత్తా యోజనాను ఆధునీకరించి, ప్రతి ఏటా 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు రూ.1,000 నెలవారీ స్కాలర్ షిప్, రెండు సంవత్సరాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ అందిస్తున్నారు. అంతేకాదు, బిహార్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను రీడిజైన్ చేసి, యువతకు రూ.4 లక్షల వరకు ఇంటరెస్ట్ ఫ్రీ లోన్లు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది విద్యార్థులు రూ. 7,880 కోట్ల లోన్లు పొందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విజయ్‌ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది 

పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2025 | 02:57 PM