Share News

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:55 AM

బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.

సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో ఇలా ప్రవర్తిస్తారా: బీఆర్ఎస్‌పై సీతక్క ఫైర్
Minister Seethakka

హైదరాబాద్, సెప్టెంబర్ 9: బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఈరోజు(బుధవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్‌ఎస్ సభ్యులు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ను మంత్రి విడుదల చేశారు.


బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిని వెనుక నుంచి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి తోసేశారని మంత్రి తెలిపారు. గంగుల కమలాకర్.. మహిళా ఎమ్మెల్యేలను వెనుక నుంచి నెట్టుకుంటూ ముందుకు వచ్చారన్నారు. పక్కపక్కన నిలుచున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను తాకుకుంటూ సుధీర్‌ రెడ్డి మధ్యలోకి వచ్చారన్నారు. ఇద్దరు మహిళా సభ్యుల మధ్యకు చొరబడాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. మహిళా నేతలను అతుక్కుని ఎందుకు నిలబడ్డారని నిలదీశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సబితమ్మపై ఆ పార్టీ సభ్యులే చేయి వేశారని తెలిపారు. మహిళా నేతల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది కీచకపర్వం అంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద ‘శుద్ధి’పై అసెంబ్లీలో దుమారం.. బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు సభ్య సమాజానికి అవమానకరం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 12:28 PM