Share News

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 17 , 2026 | 10:04 AM

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 17: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


gunpark-cm.jpg

అటు తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి..

నేడు వారాణసీకి సీఎం చంద్రబాబు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ.. ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఏసీబీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 11:19 AM