Share News

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు..

ABN , Publish Date - Sep 17 , 2026 | 08:10 AM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నేడు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు..
PM Narendra Modi Birthday

అమరావతి: ఈరోజు (గురువారం) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ఎక్స్ వేదికగా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా వారంతా ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రజాసేవలో మోదీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించడం నుంచి ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించడం వరకు ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు.

ప్రధాని మోదీ 25 ఏళ్ల ఆదర్శప్రాయమైన ప్రజాసేవ భారతదేశ అభివృద్ధి ప్రస్థానానికి కొత్త ఊపునిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ‘సేవ, సంకల్పం, సుశాసన్’ అనే ఆయన దార్శనికత 140 కోట్ల భారత పౌరులకు స్ఫూర్తినిస్తూనే ఉందని పేర్కొన్నారు. దేశ సేవలో మోదీ దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సుసంపన్నమైన జీవితం గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానిని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ఎక్స్ పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.


మీ నాయకత్వం దేశాన్ని బలపరిచింది: పవన్ కల్యాణ్

'భారత ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. గుజరాత్‌లోని వడ్నగర్‌లో ఓ చిన్న ఇంటి నుంచి దేశ ప్రధాని వరకు మీ ప్రయాణం, సంకల్పం, క్రమశిక్షణ ప్రజా సేవ పట్ల జీవితకాల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సంవత్సరాలుగా మీ నాయకత్వం భారతదేశ ప్రయాణంలో అభివృద్ధి, స్వావలంబన, జాతీయ భద్రత, ప్రజల ఆకాంక్షలను కేంద్రంగా నిలిపింది. మీ నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల విస్తరణ నుంచి భారతీయ రైల్వేల వేగవంతమైన ఆధునీకరణ వరకు దేశ రవాణా రంగం ఓ కొత్త శకంలోకి ప్రవేశిస్తోంది. డిజిటల్ ఇండియా, యూపీఐ నుంచి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వరకు మన సొంత సామర్థ్యాలపై విశ్వాసాన్ని బలపరిచింది. భారత్‌కు అంకితమైన మీ జీవితం, 25 సంవత్సరాల నిస్వార్థ సేవ ఆదర్శం. ఈ ప్రత్యేకమైన రోజున మీరు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో దేశానికి సేవ చేయడానికి నిరంతర శక్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.


విశ్వగురువుగా ఎదగాలి: పీవీఎన్ మాధవ్ ఎక్స్ పోస్టు..

'140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా.. సేవ, సుపరిపాలన, ప్రజాసంక్షేమం పునాదులుగా.. అభివృద్ధి, ఆత్మనిర్భరత, మహిళా సాధికారత సాధనాలుగా.. వికసిత్ భారత్ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తూ యావత్ ప్రపంచం మన్ననలు అందుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో త్వరలో భారత్ విశ్వగురు స్థానం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాము' అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు వారాణసీకి సీఎం చంద్రబాబు

నేరస్థలానికే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌

Updated Date - Sep 17 , 2026 | 09:09 AM