నేడు వారాణసీకి సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 17 , 2026 | 06:14 AM
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రజాభాగస్వామ్యం, సేవాభావం, సామాజిక బాధ్యత కీలకమనే సందేశాన్ని సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానంపై కాశీలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రజాభాగస్వామ్యం, సేవాభావం, సామాజిక బాధ్యత కీలకమనే సందేశాన్ని సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నెలరోజులపాటు నిర్వహిస్తారు. గురువారం ఉదయం చంద్రబాబు విజయవాడ నుంచి బయలుదేరి వారాణసీ చేరుకుంటారు. వారాణసీ-వాద్‌నగర్ సేవా యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వారాణసీ కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని, విజయవాడ బయలుదేరుతారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య