చినిగిన కరెన్సీ నోట్ల కలకలం
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:50 AM
చినిగిన కరెన్సీ నోట్లు కుప్పగా కనిపించడం విశాఖలో కలకలం రేపింది. ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన సిటీ సెంట్రల్ పార్కు వద్ద ఈ చినిగిన కరెన్సీ నోట్లు పడివున్నాయి. బుధవారం ఉదయం వాకింగ్‌కు వచ్చినవారు ఆ నోట్లను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విశాఖ సిటీ సెంట్రల్ పార్కు వద్ద గుట్టలుగా!
చెద పట్టి పాడైపోవడంతో పడేశానన్న వ్యాపారి
విశాఖపట్నం/మహారాణిపేట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): చినిగిన కరెన్సీ నోట్లు కుప్పగా కనిపించడం విశాఖలో కలకలం రేపింది. ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన సిటీ సెంట్రల్ పార్కు వద్ద ఈ చినిగిన కరెన్సీ నోట్లు పడివున్నాయి. బుధవారం ఉదయం వాకింగ్‌కు వచ్చినవారు ఆ నోట్లను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి, టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని నోట్లను పరిశీలించారు. ఆ నోట్లలో చెదలుపట్టి పాడైపోయిన రూ.500తోపాటు రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఉన్నాయి. వాటిలో ఒక మహిళ పాన్‌కార్డు, ఎల్‌ఐసీ పాత బాండ్ పేపర్లు కూడా ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేజీహెచ్ డౌన్‌లోని తాడివీధికి చెందిన ఆదిమూలపు సూర్యారావు ఆ నోట్లను పడేసినట్టు గుర్తించారు. అతడిని విచారించగా తన దుకాణంలోని బాక్స్‌లో రూ.మూడు వేల విలువైన కొత్తనోట్లు దాచానని, అవి చాలారోజులపాటు పెట్టెలోనే ఉండిపోవడంతో చెదపట్టి పాడైపోయాయని చెప్పారు. కుటుంబ సభ్యులు తిడతారనే భయంతో వాటిని చించేసి, పడేశానని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య