ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ABN , Publish Date - Aug 04 , 2026 | 03:20 PM
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని పేర్కొన్నారు.
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు (India Israel Relations).
ప్రపంచ వేదికపై ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతు అందిస్తున్న దేశాల్లో భారత్ కీలకమైనదని నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందనే ప్రచారం వాస్తవం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పలు దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య, ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో సహకారం పెరుగుతోందని చెప్పారు. ఇక, భారత్‌లో ఇజ్రాయెల్‌కు లభిస్తున్న ఆదరణ ఎంతో విలువైనదని ఆయన అన్నారు (Israel India Partnership).
భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ, వ్యవసాయం, సాంకేతికత, సైబర్ భద్రత, ఆవిష్కరణలు వంటి అనేక రంగాల్లో ఇప్పటికే బలమైన భాగస్వామ్యం కొనసాగుతోంది (Netanyahu India). ఇటీవలి కాలంలో ఇరు దేశాల నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడటంతో వ్యూహాత్మక సహకారం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి పలు కీలక ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
నేను తప్పు చేయలేదు.. దేనికైనా సిద్ధమే.. అరెస్టు తరువాత ఉదయనిధి కామెంట్
కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ