Share News

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

ABN , Publish Date - Aug 04 , 2026 | 02:47 PM

నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..
Udhayanidhi Stalin

నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా స్పష్టం చేసింది (Udhayanidhi Stalin Trisha).


కావేరి జలాల అంశంపై జరిగిన ఆందోళన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించినవిగా విమర్శలు రావడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి చెన్నైలోని నివాసం నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు (Trisha Remarks Case).


ఈ చర్యను సవాల్ చేస్తూ డీఎంకే తరఫున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు (Udhayanidhi Release). పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టిన న్యాయస్థానం, విచారణ కోసం అవసరమైతే ప్రశ్నించవచ్చని, ఆ తర్వాత ఉదయనిధిని విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సూచించింది.


ఈ వార్తలనూ చదవండి:

నేను తప్పు చేయలేదు.. దేనికైనా సిద్ధమే.. అరెస్టు తరువాత ఉదయనిధి కామెంట్

కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ

Updated Date - Aug 04 , 2026 | 03:00 PM