Share News

రాజీనామా చేస్తానంటే.. వెంటనే ఓకే చేస్తా.. అసంతృప్తులపై కర్ణాటక సీఎం వ్యాఖ్య

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:55 PM

ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిగా అవకాశం దక్కని అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో సీఎం డీకే శివకుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజీనామా చేస్తానంటే.. వెంటనే ఓకే చేస్తా.. అసంతృప్తులపై కర్ణాటక సీఎం వ్యాఖ్య
DK Shivakumar

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కర్ణాటక కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిగా అవకాశం దక్కని అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో సీఎం డీకే శివకుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు వచ్చే వరకూ సహనంతో ఉండాలని హితవు పలికారు. ఎవరైనా రాజీనామా చేస్తానంటే నిమిషాల్లో ఒకే చేస్తానని కూడా తేల్చి చెప్పారు. తాజా కేబినెట్ విస్తరణలో 20 మంది ఎమ్మెల్యేలకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకు సీఎం డీకే తన కేబినెట్‌ను విస్తరించారు.


కేబినెట్‌లో చోటు దక్కక అసంతృప్తితో ఉన్న వారిని ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రిజైన్ చేస్తానన్న వారంతా రాజకీయాలు చేస్తున్నట్టే. రాజీనామా చేస్తాననే వారిని ఎవ్వరూ ఆపలేరు. కానీ వారికి ఒక పార్టీ కావాలి. పార్టీలో భవిష్యత్తు కావాలి. అలాంటివి ఇచ్చేది తమ పార్టీ ఒక్కటే. ధరమ్ సింగ్ సమయంలో నేను రాజీనామా చేసుండొచ్చు. ఆ తరువాత కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. సిద్ధరామయ్య సమయంలో కూడా ఈ పరిస్థితి ఉంది. ఆ సమయాల్లో నేను ఓర్పుతో ఉండలేదా? వీరేంద్ర పాటిల్ హయాంలో బంగారప్పకు అవకాశం దక్కలేదు. ఖర్గే సాబ్‌కు అవకాశం రాలేదు. ఒకసమయంలో ధరమ్ సింగ్‌కు ఛాన్స్ రాలేదు. వారిలో కొందరు ఆ తరువాత సీఎంలు కాలేదా? ఇలాంటి సమయాల్లో ఓర్పుతో ఉండాలి. పార్టీ మనకు చాలా ముఖ్యం’ అని అన్నారు. ఇక అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిని పార్టీ సీనియర్ లీడర్లకు సీఎం అప్పగించారు.


ఈ వార్తలనూ చదవండి:

నేను తప్పు చేయలేదు.. దేనికైనా సిద్ధమే.. అరెస్టు తరువాత ఉదయనిధి కామెంట్

కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు హర్యానాకు ఛాన్స్ ఇవ్వాలి: కాంగ్రెస్ ఎంపీ

Updated Date - Aug 04 , 2026 | 02:39 PM