Share News

ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు ఎదురుదెబ్బ.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా అరబ్ పార్టీలు!

ABN , Publish Date - Oct 30 , 2026 | 09:45 AM

ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి తాజా పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లభించలేదు.

ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు ఎదురుదెబ్బ.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా అరబ్ పార్టీలు!
Israel Election 2026

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి తాజా పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో అరబ్ పార్టీల పాత్ర కీలకంగా మారింది. ఎన్నికల్లో అరబ్ పార్టీలు గణనీయమైన స్థానాలను గెలుచుకోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తి నెలకొంది (Israel Election 2026).


ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెస్సెట్‌లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం. తాజా ఎన్నికల తుది ఓట్ల లెక్కింపు ప్రకారం నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి ఆ కూటమి ఇంకా ఎనిమిది స్థానాల దూరంలో ఉంది (Israel Election Results).


ఈ ఎన్నికల్లో అరబ్ నేతృత్వంలోని పార్టీలకు మొత్తం 19 స్థానాలు లభించాయి. ప్రతిపక్షానికి వచ్చిన 48 స్థానాలకు అరబ్ పార్టీల 19 స్థానాలను కలిపితే మొత్తం 67 అవుతాయి. అంటే నెతన్యాహును అధికారం నుంచి తప్పించేందుకు అవసరమైన సంఖ్యా బలం ప్రతిపక్షానికి లభించే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? లేక బయట నుంచి మద్దతు ఇస్తాయా? అనేది ఇంకా స్పష్టత లేదు (Arab Parties Israel).


నెతన్యాహు ప్రభుత్వం ఏర్పాటులో విఫలమైతే ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది (Benjamin Netanyahu). ఆయనపై ఇప్పటికే అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులు కొనసాగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి సమయంలో భద్రతా వైఫల్యాలపై విచారణ జరగాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 30 , 2026 | 09:57 AM