పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 07:55 AM
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చమురు, ఇంధన రంగాల్లో భారీ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చమురు, ఇంధన రంగాల్లో భారీ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. యుద్ధం ముగిస్తే రష్యాలో అమెరికా కంపెనీలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడం, ఐరోపాకు రష్యా చమురు సరఫరాలను పునరుద్ధరించడం వంటి ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నట్లు సమాచారం (Donald Trump, Vladimir Putin).
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదనలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. రష్యా తూర్పు ప్రాంతంలోని సఖాలిన్ తీరంలో ఉన్న ఉమ్మడి చమురు ప్రాజెక్టులో అమెరికా కంపెనీలు తిరిగి భాగస్వామ్యం కావడం ఒక ప్రధాన ప్రతిపాదనగా ఉన్నట్లు సమాచారం. అలాగే రష్యా నుంచి ఐరోపాకు చమురు సరఫరాలను పునరుద్ధరించే అంశం కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డ్రుజ్బా పైప్‌లైన్ ద్వారా రష్యా చమురు మళ్లీ ఐరోపా దేశాలకు చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు సహజ వాయువు, టైటానియం ఉత్పత్తి, విమానయాన రంగాల్లోనూ అమెరికా-రష్యా మధ్య సహకారానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది (US Russia Relations).
వచ్చే నెలలో అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది (Russia Ukraine War). ఈ ఒప్పందాలతో యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్‌ను ఒప్పించాలని అమెరికా భావిస్తోంది. అయితే పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరిస్తారా? అమెరికా ప్రతిపాదిస్తున్న వ్యాపార అవకాశాలు శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, చమురు ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధం ముగియడానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు