Home » Russia-Ukraine war
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్‌కు ఐరోపాదేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌కు స్నేహితుడైన పుతిన్ యుద్ధం విరమించేలా నచ్చచెప్పాలంటూ ఐరోపా దేశాల ప్రతినిధులు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు.
శనివారం రష్యా జరిపిన దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లోని గృహ సముదాయాలపై జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై రష్యా క్షిపణులు, డ్రోన్‌లతో దాడులకు పాల్పడింది.
మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసి మహమ్మద్ అహ్మద్ (37)కు ఊహించని కష్టం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీ తరఫున బలవంతంగా ఫైట్ చేయాల్సి వస్తోంది. అతడి పరిస్థితిని అతడి భార్య భారత విదేశాంగ శాఖకు వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎన్నో ఏళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే ఎంతో మంది సైనికులు చనిపోయారు. రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి.
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉన్మాద చర్య పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించరాదని అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి భారత్ నిధులు సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఉక్రయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో తమ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని రష్యా విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఎన్నో ఒత్తిడుల మధ్య ఈ స్నేహానికి కట్టుబడి ఉన్న భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
రష్యా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయని తెలిపింది. శాంతిస్థాపనకు ఐరోపా దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. చర్చలకు ద్వారాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, శాంతిస్థాపనకు రష్యా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.
కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది.
కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్‌పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.