Russia Counters USA: భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
ABN , Publish Date - Sep 15 , 2025 | 07:51 AM
భారత్‌తో తమ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని రష్యా విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఎన్నో ఒత్తిడుల మధ్య ఈ స్నేహానికి కట్టుబడి ఉన్న భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో తమ బంధం కాలపరీక్షకు నిలిచినదని రష్యా విదేశాంగ శాఖ తాజాగా పేర్కొంది. ఈ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ అంతిమంగా విఫలమవుతాయని హెచ్చరించింది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ సహా ఇతర రష్యా మిత్ర దేశాలపై యూరప్, నాటో దేశాలు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ ఈ కామెంట్స్ చేసింది. భారత్, రష్యాల బంధం స్థిరమైన రీతిలో పురోగమిస్తోందని వ్యాఖ్యానించింది (India Russia partnership).
అమెరికా, నాటో దేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి ఎదురొడ్డి నిలుస్తున్న భారత్‌పై రష్యా ప్రశంసల వర్షం కురిపించింది. బెదిరింపులకు లొంగకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి భారత్ ఉందంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. రష్యాతో దీర్ఘకాలిక బంధం, అంతర్జాతీయ వ్యవహారాల్లో వ్యూహాత్మక స్వేచ్ఛకు అనుగూణంగా భారత్ చర్యలు ఉన్నాయని రష్యా విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వానికి భారత్-రష్యా భాగస్వామ్యం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు (U.S. tariffs impact India Russia).
ఇరు దేశాల మధ్య రవాణా సౌకర్యాలు పెంచేందుకు, జాతీయ కరెన్సీల్లో చెల్లింపులకు, కొత్త పేమెంట్ విధానాల అభివృద్ధికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. పౌర, మిలిటరీ రంగాలకు చెందిన అనేక ప్రాజెక్టులను భారత్ రష్యా ఇప్పటికే కలిసి నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష రంగం, అణుశక్తిలో కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి (strategic autonomy India).
భారతపై అమెరికా 50 శాతం సుంకం విధించిన విషయం తెలిసిందే. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఇతర దేశాలపై సుంకాలు మరింత పెంచాలని కూడా ట్రంప్.. జీ7, నాటో దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని కూడా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే భారత్-అమెరికా మధ్య వాణిజ్య డీల్ కుదిరేందుకు తెర వెనుక ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదరచ్చని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
100 శాతం సుంకం తప్పదంటూ ట్రంప్ హెచ్చరికలు.. స్పందించిన చైనా
భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. అయినా చేశా: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం