China-Trump Tariff Threat: 100 శాతం సుంకం తప్పదంటూ ట్రంప్ హెచ్చరికలు.. స్పందించిన చైనా
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:40 PM
చైనాపై నాటో దేశాలు 100 శాతం వరకూ సుంకాలు విధించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునివ్వడంపై చైనా స్పందించింది. ఈ ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని హెచ్చరించింది. చైనా ఎప్పటికీ యుద్ధాన్ని కోరుకోదని విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలంటూ నాటో దేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై చైనా తాజాగా స్పందించింది. అదనపు ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ హెచ్చరించారు. చైనా ఎప్పటికీ యుద్ధాలను కోరుకోదని అన్నారు. యుద్ధాలతో ఏ సమస్యా పరిష్కారం కాదని కూడా చెప్పారు. శనివారం స్లోవేనియా ఉపప్రధానితో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు (China rejects Trump tariffs).
‘యుద్ధాల్లో పాల్గొనడం కానీ వాటి కోసం ప్రణాళికలను రెడీ చేయడం కానీ చైనా ఎన్నటికీ చేయదు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, రాజీ కుదిర్చేందుకు, చర్చలను ప్రోత్సహిస్తుంది’ అని వాంగ్ యీ స్పష్టం చేశారు. బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పాటు దిశగా ప్రోత్సాహకాలు ఉండాలని అన్నారు. వివిధ దేశాలతో కూడిన వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు, సిద్ధాంతాలకు మరిన్ని రక్షణలు కల్పించాలని కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు, ఘర్షణలు నెలకొన్నాయని అన్నారు (Wang Yi peace talks). ‘చైనా, ఐరోపా దేశాలు స్నేహితులుగా ఉండాలి. ప్రత్యర్థులుగా కాదు. సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఇరు వర్గాలపైనా ఉంది’ అంటూ ట్రంప్ సుంకాలపై పరోక్షంగా స్పందించారు.
అంతకుముందు ట్రంప్ ఈ అంశాలపై మాట్లాడుతూ.. రష్యాపై చైనా పట్టు ఎక్కువని వ్యాఖ్యానించారు. 50 నుంచి 100 శాతం సుంకాలు విధిస్తేనే ఈ పట్టు సడలుతుందని అన్నారు. కాబట్టి నాటో దేశాలు చైనాపై 50 నుంచి 100 శాతం సుంకాలు విధించాలని కోరారు. చైనా అధ్యక్షుడు అమెరికాపై కుట్రలు పన్నుతున్నారనీ ట్రంప్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. అయినా చేశా: డొనాల్డ్ ట్రంప్
సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం