Share News

Elon Musk-Suchir Balaji: సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:53 PM

ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీది ఆత్మహత్య అయ్యుండొచ్చన్న ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వాదనలను ఎలాన్ మస్క్ తోసి పుచ్చారు. అతడిది హత్యే అని కరాఖండీగా తేల్చి చెప్పారు.

Elon Musk-Suchir Balaji: సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
Elon Musk Suchir Balaji murder

ఇంటర్నెట్ డెస్క్: ఒపెన్‌ ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీని ఎవరో కచ్చితంగా హత్య చేసి ఉంటారని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ బహిరంగంగా తేల్చి చెప్పారు. అతడిది ఆత్మహత్య అని తాను విశ్వసిస్తున్నట్టు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. అతడిది హత్యే అని కరాఖండీగా చెప్పారు. శామ్ ఆల్ట్‌మన్ ఇంటర్వ్యూను కూడా షేర్ చేశారు (Elon Musk Suchir Balaji murder).

ఇంటర్వ్యూ సందర్భంగా సుచిర్ బాలాజీ మృతి గురించి శామ్ ఆల్ట్‌మన్‌పై యాంకర్ సూటి ప్రశ్నలు సంధించారు. ‘మీ ప్రోగ్రామర్‌లలో ఒకరు గతంలో సంచలన ఆరోపణలు చేశారు. మీరు జనాలకు చెందిన వాటిని వాడుకుంటూ డబ్బు చెల్లించట్లేదని ఆరోపించాడు. ఆ తరువాత అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ? అతడు నిజంగానే సూసైడ్ చేసుకున్నాడని మీరు భావిస్తున్నారా?’ అని యాంకర్ ప్రశ్నించారు (OpenAI researcher Suchir Balaji death).


దీనికి శామ్ ఆల్ట్‌మన్ స్పందిస్తూ..‘అతడిది ఆత్మహత్యే అని నేను అనుకుంటున్నాను. అతడు నాకు మరీ క్లోజ్ ఫ్రెండ్ కాకపోయినప్పటికీ ఫ్రెండ్ లాంటి వ్యక్తే. ఓపెన్‌ఏఐ సంస్థలో చాలా కాలం పనిచేశాడు. అతడి మృతి మమ్మల్ని బాగా కలచివేసింది. బాలాజీ గురించి మీడియాలో వచ్చిన విషయాలను చాలా వరకూ చదివాను. అతడిది ఆత్మహత్యే అని నాకు అనిపిస్తోంది’ అని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నాడు. ఈ అంశంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి (Sam Altman Suchir Balaji comment).

గతేడాది డిసెంబర్‌లో శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని తన అపార్ట్‌‌మెంట్‌లో సుచిర్ బాలాజీ మృతి చెందాడు. అతడి మృతి విషయంలో అనుమానించాల్సిందేమీ లేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యగా నిర్ధారించారు. అక్కడి చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, బాలాజీని ఎవరో హత్య చేశారని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఏఐ సాంకేతికతను వ్యాపారానికి వాడుకోవడంపై సుచిర్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడని అతడి తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అపరిమిత ఆశావాద దృక్పథంతో ఉండే అతడిలో రానురాను ఏఐపై అనుమానాలు పెరిగిపోయాయని అన్నారు. మానవత్వానికి ఏఐతో ముప్పు అని భావించడం మొదలెట్టాడని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

చార్లీ కిర్క్ హత్య.. వైరల్ వీడియోల్లో కీలక విషయాలు వెలుగులోకి

నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 11 , 2025 | 07:31 PM