Home » Elon Musk
రాబోయే ఐదు, పదేళ్లలో అణుయుద్ధం జరగొచ్చని ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఎక్స్‌లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందనగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ అణు యుద్ధం గురించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కొడుకు పేరు శేఖర్ అని తెలిపారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను తాజా పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. జిరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితం గురించి, తన సహజీవన భాగస్వామి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఏఐతో జాబ్స్ అన్నీ పోతాయని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ఆ తరువాతే మనషులకు అసలైన స్వేచ్ఛ వస్తుందని అన్నారు. కాలు కదపకుండానే నచ్చిన జీవనశైలిని ఎంజాయ్ చేయొచ్చని, సార్వత్రిక ఆదాయ విధానం కూడా అమల్లోకి వస్తుందని అన్నారు.
స్పెస్ ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్ షిప్ 11వ ప్రయోగం విజయవంతమైంది. సూపర్ హెవీ బూస్టర్‌ను నియంత్రిత విధానంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్ర తీరంలో కూల్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ తీసుకువచ్చిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ఇద్దరి మధ్యా చిచ్చుపెట్టింది. దీన్ని మస్క్ వ్యతిరేకించారు. ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సైతం చేసుకున్నారు.
వలసలకు వ్యతిరేకంగా యునైట్ ది కింగ్‌డమ్ పేరిట లండన్‌లో తాజాగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వర్చువల్‌గా ఎలాన్ మస్క్ ప్రసంగించారు. నిరసనకారులు తిరగబడి పోరాడకపోతే మరణం తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏఐ పరిశోధకుడు సుచిర్ బాలాజీది ఆత్మహత్య అయ్యుండొచ్చన్న ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ వాదనలను ఎలాన్ మస్క్ తోసి పుచ్చారు. అతడిది హత్యే అని కరాఖండీగా తేల్చి చెప్పారు.
ట్రంప్ ప్రాపకం కోసం భారత్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న పీటర్ నవారో మాటలన్నీ అబద్ధాలని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' తేల్చి చెప్పింది. నవారో పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలు తప్పని నిర్ధారించింది.
ఇటీవల కాలంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ తాజాగా మరో కాంట్రవర్సీకి దారి తీసింది. న్యూయార్క్‌లో 34 కేసుల్లో దోషిగా తేలిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద క్రిమినల్ అని పేర్కొంది. ఇది మరో వివాదానికి తెర తీసింది.