Share News

Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. అయినా చేశా: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Sep 12 , 2025 | 10:38 PM

భారత్‌పై సుంకాలు విధించడం అంత సులభమైన వ్యవహారం కాదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అయితే, రష్యాకు ముకుతాడు వేసేందుకు సుంకాలు విధించానని తెలిపారు. ఇప్పటికే ఏడు యుద్ధాలను కూడా ఆపానని మరోసారి ఫాక్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.

Donald Trump: భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ కాదు.. అయినా చేశా: డొనాల్డ్ ట్రంప్
Trump says tariffs caused rift with India

ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై సుంకాలు విధించడం అంత ఈజీ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిందని చెప్పారు (tariffs cause rift with India).

‘భారత్ చాలా పెద్ద కస్టమర్. అయినా రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు 50 శాతం సుంకం విధించా. ఇది అంత సులభమైన విషయం కాదు. చాలా పెద్ద విషయం.. భారత్‌తో ఉద్రిక్తతలకు దారి తీసింది’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పుతిన్ కట్టడికి ఇది అవసరమని అన్నారు. అయితే, సుంకాలు విధించడం అంత సులభం కాకపోయినా తాను చేశానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐరోపా వ్యవహారమని కూడా గుర్తు చేశారు (Trump India 50% Tariff).


ఇక ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలను అడ్డుకున్నానని కూడా ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ‘నేను భారత్-పాక్ యుద్ధం సహా ఏడింటిని ఆపాను. వీటిల్లో చాలా భారీ ఘర్షణలు కూడా ఉన్నాయి. కాంగో రువాండా యుద్ధాన్ని ముగించడం అసంభవం అని అన్నారు. 31 ఏళ్లుగా సాగుతోందని అన్నారు. లక్షల మంది చనిపోయారు. కానీ నేను యుద్ధాన్ని ఆపాను’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇక రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆరోపణలను భారత్ ఇప్పటికే పలుమార్లు హుందాగా తిప్పికొట్టింది. దేశీయ ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగూణంగా తాము నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ అవసరం ఉందని అన్నారు. భారత్‌లో మిడిల్ క్లాస్ వర్గం అమెరికా కంటే ఎక్కువని అన్నారు. అమెరికా చమురు, ఇతర ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేయాలని అన్నారు. ఈ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 10:46 PM