Share News

Kirk-Murder Suspect: కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు

ABN , Publish Date - Sep 12 , 2025 | 07:16 PM

కిర్క్ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు.

Kirk-Murder Suspect: కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు
Charlie Kirk suspect in custody

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ (శుక్రవారం) కీలక ప్రకటన చేశారు. సంప్రదాయ వాది, హక్కుల కార్యకర్త చార్లీ కిర్క్ హత్య కేసులో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ‘అతడు దొరికాడు’ అని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ (Donald Trump) తెలిపారు. అనుమానితుడికి తెలిసిన వ్యక్తే అతడి వివరాలను పోలీసులకు అందించాడని అన్నారు. అయితే, నిందితుడి పేరు, ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక కిర్క్ అంత్యక్రియలకు కూడా తాను హాజరవుతానని చెప్పారు (Charlie Kirk suspect in custody).

రచయిత, పాడ్‌క్యాస్ట్ నిర్వాహకుడు, సంప్రదాయ వాద స్టూడెంట్ గ్రూపు టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడైన చార్లీని బుధవారం ఓ వ్యక్తి హైపవర్డ్ రైఫిల్‌తో 100 మీటర్ల దూరం నుంచి కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఓ అనుమానితుడి ఫొటోను సేకరించిన పోలీసులు అతడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే ఎఫ్‌బీఐ అతడి ఫొటోలను కూడా ప్రజలకు విడుదల చేసింది. అతడి జాడ చెప్పిన వారికి లక్ష డాలర్ల నజరానాను కూడా అధికారులు ప్రకటించారు.


కిర్క్ హత్యను డెమాక్రాట్లు, రిపబ్లికన్లూ ఇద్దరూ ఖండించారు. వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా ఈ దారుణాన్ని నిరసించాయి. ఇక అమెరికా అత్యున్నత పౌరపురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌‌ను అమెరికా అధ్యక్షుడు కిర్క్‌కు ప్రకటించారు. ట్రంప్‌కు ముఖ్య సన్నిహితుల్లో ఒకడైన కిర్క్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్

నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 07:49 PM