Zelensky about India: భారత్ మావైపే ఉంటుంది.. ట్రంప్‌నకు షాకిచ్చేలా జెలెన్‌స్కీ వ్యాఖ్యలు..
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:47 PM
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి భారత్ నిధులు సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఉక్రయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి భారత్ నిధులు సమకూరుస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే (Trump India criticism). ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమవైపే ఉందని తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశంలో మోదీ ప్రభుత్వం మనసు మార్చుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు (Zelensky Fact‑Checks Trump).
'రష్యాతో భారత్ చేసుకున్న ఒప్పందం మాకు సమస్యగా మారింది. కానీ, దీనిని ట్రంప్ పరిష్కరించగలరని అనుకుంటున్నా. భారత్ తరహాలో చైనా మాకు మద్దతిస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ఆపెయ్యడం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఏదీ లేదని చైనా అనుకుంటోంది. అయినప్పటికీ ట్రంప్ తలచుకుంటే జిన్‌పింగ్ వైఖరిని కూడా మార్చగలరు' అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆదాయం సమకూరుస్తున్న దేశాలపై సుంకాలు విధించడం సరైన నిర్ణయమేనని గతంలో జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు (Russia‑Ukraine war India stance).
తాజాగా భారత్ విషయంలో ఆయన తన వైఖరిని మార్చుకున్నట్టు అర్థమవుతోంది. అయితే తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఐరాసా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు (India energy imports Russia). రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలు ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. అలాగే నాటో దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనడాన్ని తగ్గించడం లేదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..