Share News

Haris Rauf wife post: మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..

ABN , Publish Date - Sep 22 , 2025 | 10:03 PM

ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు పలు వివాదాలకు కారణమవుతున్నాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాక్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

Haris Rauf wife post: మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..
Haris Rauf controversy

ఆసియా కప్-2025లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు పలు వివాదాలకు కారణమవుతున్నాయి. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం దుమారం రేపింది. ఆ అవమానాన్ని పాక్ ఆటగాళ్లు, ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా గ్రూప్-4లో భాగంగా ఆదివారం ఈ రెండు జట్లూ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కూడా పలుసార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి (Haris Rauf controversy).


పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, భారత అభిమానులు 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేశారు. దీంతో రవూఫ్ అసహనానికి గురయ్యాడు (Haris Rauf backlash). అభిమానుల వైపు తిరిగి తన చేతితో '6-0' అని చూపించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఆరు ఫైటర్ జెట్‌లను కూల్చివేసినట్లు పాకిస్థాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. పాక్ వాదనకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయినప్పటికీ ఆ దేశ నాయకులు, ప్రజలతో పాటు క్రికెటర్లు కూడా అది నిజమని నమ్ముతున్నారు.


అందుకే తాజా మ్యాచ్‌లో రవూఫ్ ఆ సంజ్ఞ చేసి భారత అభిమానులను రెచ్చగొట్టాలని చూశాడు. తాజాగా రవూఫ్ భార్య ముజ్నా మసూద్ మాలిక్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది (battle post Haris Rauf wife). రవూఫ్ సంజ్ఞలను పోస్ట్ చేస్తూ.. 'మ్యాచ్ ఓడినా.. యుద్ధంలో గెలిచాం' అని కామెంట్ చేసింది. అయితే ఆ పోస్ట్ బాగా వైరల్ కావడంతో ఆమె వెంటనే దానిని డిలీట్ చేసింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

pak3.jpg


ఇవి కూడా చదవండి..

హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..

ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 22 , 2025 | 10:03 PM