Share News

Farhan AK47 gesture: హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:25 PM

పాకిస్థాన్‌ టెర్రరిస్టులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ఫర్హాన్‌ అలా తుపాకీ పేలుస్తున్నట్టు చేసిన సెలెబ్రేషన్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఈ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farhan AK47 gesture: హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..
Sahibzada Farhan AK47 gesture

ఆదివారం భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ కీలక అర్ధశతకం సాధించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేసి మంచి పునాది వేశాడు. అయితే అర్ధశతకం సాధించిన తర్వాత మైదానంలో అతడు సెలబ్రేట్ చేసుకున్న తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి అర్ధ శతకం పూర్తి చేసిన ఫర్హాన్‌ గన్‌ ఫైరింగ్‌ చేస్తున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు (Farhan India match controversy).


పాకిస్థాన్‌ టెర్రరిస్టులు పహల్గామ్‌లో దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో.. ఫర్హాన్‌ అలా తుపాకీ పేలుస్తున్నట్టు చేసిన సెలెబ్రేషన్‌పై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు (AK47 celebration). పాకిస్థాన్‌కు చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఈ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫర్హాన్ తాజాగా ఆ సెలబ్రేషన్స్‌పై స్పందించాడు. శ్రీలంకతో పాక్ రెండో సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఫర్హాన్‌ పాల్గొన్నాడు. ఆ సమయంలో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్స్ గురించి జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు (Farhan breaks silence).


'సాధారణంగా 50 పరుగులు చేసిన తర్వాత నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోను (Farhan response). కానీ, ఈ రోజు ఏదైనా చేయాలని అనుకున్నా. అందుకే అలా చేశా. ఆ క్షణంలో అలా చేయాలనిపించింది. ప్రజలు దానిని ఎలా తీసుకున్నా నాకు ఫర్వాలేదు. దాని గురించి నాకు పట్టింపు లేదు. ఏ దేశంతో ఆడినా దూకుడు ప్రదర్శించాలనేది నా ఫిలాసఫీ. మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా ఇదే దూకుడును ప్రదర్శిస్తాం' అని ఫర్హాన్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి..

పాక్ కెప్టెన్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు


భారత్, పాక్ మ్యాచ్.. టాస్ సందర్భంగా సేమ్ సీన్ రిపీట్..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 22 , 2025 | 05:50 PM