Share News

Pakistan vs India: పాక్ కెప్టెన్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:09 PM

ఆసియా కప్‌ గ్రూప్-4 దశలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరోసారి భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ వరుసగా రెండో సారి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Pakistan vs India: పాక్ కెప్టెన్ ఏం చేస్తున్నాడో తెలియడం లేదు: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
Shoaib Akhtar

ఆసియా కప్‌ గ్రూప్-4 దశలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మరోసారి భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ వరుసగా రెండో సారి టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఆ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాపై తీవ్ర విమర్శలు చేశాడు (Shoaib Akhtar on Salman Agha).


'పాక్ జట్టులో కెప్టెనే బలహీన ఆటగాడు. సల్మాన్ అఘా ఇప్పటివరకు ఏం చేశాడో తెలియడం లేదు. మా జట్టు అత్యంత బలహీనంగా కనిపించడానికి సల్మాన్ అఘానే కారణం. అతడి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి, ఏ సమయంలో ఎలా ఆడాలి అనే విషయంలో సల్మాన్‌కు క్లారిటీ లేదు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కూడా దూకుడు ప్రదర్శించలేదు. కొందరికి సల్మాన్ మంచి బాలుడిగా, మంచి కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. కానీ, జట్టు పరంగా అతడు చాలా వీక్ ఆటగాడు' అని అక్తర్ మండిపడ్డాడు (Salman Agha weakest link).


ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో పాక్‌పై నెగ్గింది (Shoaib Akhtar criticism). ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (58) అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అభిషేక్‌ (74 పరుగులు) నిలిచాడు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:09 PM