India vs Pakistan 2025: భారత్, పాక్ మ్యాచ్.. టాస్ సందర్భంగా సేమ్ సీన్ రిపీట్..
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:47 PM
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో నేడు టీమిండియా దుబాయ్ వేదికగా సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది (India vs Pakistan). మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు (India vs Pakistan 2025).
తాజా మ్యాచ్ సందర్భంగా కూడా ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. టాస్ కార్యక్రమం తర్వాత ఇరు జట్లు కెప్టెన్లు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. లీగ్ దశలో జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ ప్రైకాఫ్ట్ ఈ మ్యాచ్‌కు కూడా రిఫరీగా వ్యవహరించబోతున్నారు (Asia Cup 2025 today match). ప్రైకాఫ్ట్‌పై గతంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాజా మ్యాచ్‌కు కూడా అతడే రిఫరీ బాధ్యతలు నిర్వర్తించనుండడం గమనార్హం.
టీమిండియా తుది జట్టు: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ తుది జట్టు: సైమ్ ఆయూబ్, ఫర్హాన్, ఫకార్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ ఆఫ్రీది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి