Share News

Hyderabad man in Russia: ఒక భారతీయుడు చనిపోయాడు.. మాకు యుద్ధం చేయాలని లేదు.. హైదరాబాదీ యువకుడి ఆవేదన

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:52 AM

మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసి మహమ్మద్ అహ్మద్ (37)కు ఊహించని కష్టం ఎదురైంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీ తరఫున బలవంతంగా ఫైట్ చేయాల్సి వస్తోంది. అతడి పరిస్థితిని అతడి భార్య భారత విదేశాంగ శాఖకు వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Hyderabad man in Russia: ఒక భారతీయుడు చనిపోయాడు.. మాకు యుద్ధం చేయాలని లేదు.. హైదరాబాదీ యువకుడి ఆవేదన
Hyderabad man in Russia

'నాతో శిక్షణ పొందిన 25 మందిలో 17 మంది మరణించారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. మేం యుద్ధ రంగంలోకి వెళ్లడానికి నిరాకరించాం. వారు మమ్మల్ని బెదరిస్తున్నారు' అంటూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న ఓ తెలుగు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ సెల్ఫీ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసి మహమ్మద్ అహ్మద్ (37)కు ఊహించని కష్టం ఎదురైంది (Indian died in Russia).


ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీ తరఫున బలవంతంగా ఫైట్ చేయాల్సి వస్తోంది. అతడి పరిస్థితిని అతడి భార్య భారత విదేశాంగ శాఖకు వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ 25న అహ్మద్ రష్యాకు వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు. అహ్మద్‌తో పాటు మరో 30 మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది. అనంతరం, ఉక్రెయిన్‌తో యుద్ధం చేయాలంటూ అహ్మద్‌తో పాటు 26 మందిని ఇటీవల సరిహద్దులకు తరలించింది (Indians in Russian army).


'నా కాలికి గాయం అయింది. ప్లాస్టర్ వేశారు. నేను నడవలేకపోతున్నాను. దయచేసి నన్ను ఇక్కడికి (రష్యా) పంపిన ఏజెంట్‌ను శిక్షించండి. అతడు నన్ను చిక్కుల్లో పడేశాడు. 25 రోజులు పని లేకుండా నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. నేను పని అడుగుతూనే ఉన్నాను. కానీ ఫలించలేదు. రష్యాలో ఉద్యోగం ముసుగులో నన్ను బలవంతంగా యుద్ధంలోకి లాగారు" అని సెల్ఫీ వీడియోలో అహ్మద్ పేర్కొన్నాడు (Russia Ukraine war).


అహ్మద్ భార్య గత వారం మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించి, అహ్మద్‌ను తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి సహాయం చేయమని అభ్యర్థించారు (Indian migrant soldiers). దీంతో అహ్మద్‌ను తిరిగి తీసుకురావడం గురించి ఒవైసీ విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి అహ్మద్ వివరాలను రష్యన్ అధికారులకు తెలిపింది. త్వరలోనే అహ్మద్ విడుదలవుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

సత్య నాదెళ్ల వేతనం రూ.850 కోట్లు

మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2025 | 10:52 AM