ఇరాన్ అణ్వాయుధాలు.. ఫేక్ సోషల్ మీడియా పోస్టుపై నెతన్యాహు స్పందన..
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:05 AM
ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆగస్టు 5న భారత్‌కు చెందిన ఓ అనామక ఎక్స్ ఖాతా ద్వారా ఈ పోస్ట్‌ను వైరల్ చేశారు (Iran nuclear program).
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీదీ పేరుతో ఈ సంచలన వ్యాఖ్యను పోస్టు చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాల అభివృద్ధి ప్రయత్నాలను వదులుకోదని, అమెరికా-ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ కూడా వాటిని కోరుకుంటుందని వహీదీ చెప్పినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఆ జనరల్ నిజంగా అలాంటి వ్యాఖ్య చేసినట్లు ఎలాంటి ఆధారమూ లభించలేదు. పోస్టులో ఉపయోగించిన చిత్రాల్లో ఒకటి ఏఐతో రూపొందించినదిగా గుర్తించారు (Fake Iran nuclear claim).
పోస్టును ఇజ్రాయెల్‌కు చెందిన పలు సామాజిక మాధ్యమ ఖాతాలు పంచుకున్నాయి (Israel Iran conflict). అనంతరం ఓ ఇజ్రాయెల్ టెలివిజన్ ఛానల్ కూడా దాన్ని ప్రసారం చేసింది. జెరూసలేం సమీపంలోని మౌంట్ హెర్జ్‌ల్‌లో జరిగిన జాతీయ కార్యక్రమంలో నెతన్యాహు ప్రసంగిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాల విషయంలో తన వాదనకు ఈ సమాచారాన్ని ఆధారంగా ప్రస్తావించారు. అమెరికా సోషల్ మీడియాలోనూ, మీడియా చానెల్స్‌లోనూ ఈ సమాచారం బాగా వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..