Share News

అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Aug 17 , 2026 | 07:49 AM

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 30 వేల డాలర్లు (దాదాపు రూ.29 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది.

అమెరికా సైనికుడిని చంపితే రూ.29 లక్షలు.. ఇరాన్ సంచలన ప్రకటన..
Iran bounty US soldiers

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా 30 వేల డాలర్లు (దాదాపు రూ.29 లక్షలు) బహుమతిగా ఇస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. మహిళలు ఈ చర్యకు పాల్పడితే బహుమతి మొత్తాన్ని 60 వేల డాలర్లకు పెంచుతామని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమిర్ హతామీ ప్రకటించినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది (Iran bounty US soldiers).


అమెరికా సైనికుడిని పట్టుకుని ఇరాన్‌కు అప్పగించినా లేదా చంపినా 30 వేల డాలర్లు బహుమతిగా అందజేస్తామని హతామీ ప్రకటించారు. అయితే అమెరికా సైనికులను ఎక్కడ, ఎప్పుడు పట్టుకోవాలి లేదా దాడి చేయాలి అనే విషయంలో హతామీ ఎలాంటి నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదు. ఈ ప్రకటనలో మరో సంచలన అంశం మహిళలకు ఇచ్చిన ప్రత్యేక ప్రోత్సాహకం. ఇరాన్ మహిళ ఎవరైనా అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం వంటి చర్యకు పాల్పడితే సాధారణ బహుమతికి రెట్టింపు మొత్తాన్ని అందిస్తామని హతామీ చెప్పారు. అంటే 30 వేల డాలర్లకు బదులుగా 60 వేల డాలర్లు లభిస్తాయి (Iran America conflict).


అమెరికా సైనికుడిని చంపేందుకు ఉపయోగించిన ఆయుధానికి కూడా ప్రత్యేక బహుమతి ఉంటుందని హతామీ తెలిపారు (Iran US war). ఆ ఆయుధాన్ని దాని విలువకు రెట్టింపు ధరకు కొనుగోలు చేసి, దాని స్థానంలో కొత్త ఆయుధాన్ని అందిస్తామని హతామీ చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ఆయుధాన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న ఒక మ్యూజియంలో ప్రదర్శిస్తారట. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 17 వేల మంది అమెరికా సైనికులు మరణించినట్టు ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

Updated Date - Aug 17 , 2026 | 07:49 AM