Share News

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:47 PM

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు.

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
Telangana DGP CV Anand

హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈరోజు (శుక్రవారం) నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ అవేర్‌నెస్ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.


వారు ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతున్నారు..

సురక్ష కా తిరంగా కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్‌ను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కల్పిస్తున్నామని డీజీపీ తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకు ఫిజికల్ దోపిడీలు జరిగేవని.. కానీ ఇప్పుడు నార్కోటిక్, సైబర్ నేరాలు పెరిగాయని వెల్లడించారు. నార్కోటిక్స్ బారినపడి విద్యార్థులు, యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారు.. ఫిర్యాదు చేయడానికి కూడా వెనకాడుతున్నారని చెప్పుకొచ్చారు.


ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ..

సైబర్ నేరాల బారినపడుతున్న వారు.. ఎవరు ఏం అనుకుంటారోనని బయటకు కూడా చెప్పుకోవడం లేదని డీజీపీ అన్నారు. తాము 40 రకాల సైబర్ నేరాలను గుర్తించామని తెలిపారు. ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఉంటున్నాయని వివరించారు. తాము ఎంత అడ్డుకట్ట వేస్తున్నా.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ కొత్తగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 02:42 PM