Share News

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:08 PM

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి
Telangana CEO Sudarshan Reddy

హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి (Telangana CEO Sudarshan Reddy) పేర్కొన్నారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని.. వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరణ పేరుతో రూ.5లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వాట్సాప్ లింక్ ద్వారా దరఖాస్తు నింపాలని కోరుతున్నారని తెలిపారు.


బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్, CVV, ATM PINలను సైబర్ నేరగాళ్లు అడుగుతున్నారని సీఈవో తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు ECI, తెలంగాణ CEO కార్యాలయం నుంచి రావని స్పష్టం చేశారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించొద్దని సూచించారు. మోసపూరిత సందేశాలు వస్తే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీఈవో సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు

మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 01:41 PM