జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:25 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా తెలంగాణకు కేసీఆర్ నష్టం చేశారని ఆగ్రహించారు. ఈరోజు (గురువారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీలో గద్దె ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావని ప్రస్తావించారు. కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తాననే విషయాన్ని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి మర్చిపోయినట్లుగా ఉన్నారని విమర్శించారు.
వారు రోజుకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నారు..
జగదీశ్వర్ రెడ్డి రాజకీయాల కోసం రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసిన, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి రోజుకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఏపీకి అదనంగా తరలించుకొని పోయిన నీటి గురించి వైసీపీ నేతలే ప్రెస్‌మీట్లు పెట్టి మరి చెబుతున్నారని అన్నారు. గతంలో జగన్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీ వేదికగా శ్రీశైలం నుంచి తీసుకెళ్తున్న నీటిని ప్రస్తవించలేదా..? అని నిలదీశారు. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులను పెంచుతున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..
జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగదీశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉన్నా దేవుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. మళ్లీ బీఆర్ఎస్ నేతలు కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. కృష్ణాలో 500 టీఎంసీల నీటి కోసం కాంగ్రెస్ కోట్లాడుతోందని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బేసిన్‌లు లేవు, బేషజాలు లేవని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు చేసే విమర్శలకు తాము అసెంబ్లీలో చర్చిస్తామని.. కేసీఆర్ సభకు రావాలని యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
వార్తలు కూడా చదవండి...
ఆ బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు
మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News