ఇరాన్‌పై మరో యుద్ధానికి సిద్ధం.. ట్రంప్, నెతన్యాహు మధ్య చర్చలు జరిగాయా..
ABN , Publish Date - Nov 01 , 2026 | 09:42 PM
శ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశం ఉందా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు జరిగే అవకాశం ఉందా? అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ ఈ అనుమానాలకు కారణం. అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3న జరగనున్న నేపథ్యంలో, ఆ తర్వాత ఇరాన్‌పై మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి (Israel Iran War 2026).
అక్టోబర్ 31న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం పేర్కొంది. ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్య చేపట్టడం గురించి అమెరికా అధికారులు చర్చిస్తున్న సమయంలో ఈ సంభాషణ జరిగినట్లు సమాచారం. అయితే ఇద్దరు నేతలు ఏ అంశాలపై మాట్లాడారనే పూర్తి వివరాలు బయటకు రాలేదు. అంతకుముందు వైట్‌హౌస్‌లో ట్రంప్ ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సమావేశమై ఇరాన్‌పై తదుపరి చర్యలకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది (US Iran War).
అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి (Trump Netanyahu phone call). ఈ ఎన్నికల ఫలితాలు ఇరాన్‌పై ట్రంప్ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఇజ్రాయెల్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలితే, తన రాజకీయ బలాన్ని ప్రదర్శించేందుకు ట్రంప్ సైనిక చర్యలకు మొగ్గు చూపవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ నుంచి కొత్త దాడులు జరిగితే గట్టిగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. తమ సైనిక దళాలను పూర్తి అప్రమత్త స్థితిలో ఉంచినట్లు ఇరాన్ రక్షణ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..