Share News

మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:56 PM

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..
Rahul Gandhi, Amit Shah

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి కావాలన్న కోరిక ఉంటే జీవితాంతం మాక్ పార్లమెంట్‌లోనే ఉండాలని, దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం మాత్రం రాదని వ్యాఖ్యానించారు. ఆదివారం చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు (Amit Shah VS Rahul Gandhi).


'రాహుల్ జీ.. మీరు ప్రధానమంత్రి కావాలనుకుంటే జీవితాంతం మీ మాక్ పార్లమెంట్‌లోనే ఉండండి. అక్కడ మీరు ప్రధానమంత్రి కావచ్చు. కానీ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం మాత్రం మీకు రాదు' అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతకుముందు ఢిల్లీలో జరిగిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ప్రతిపక్ష కూటమి నేతలు పాల్గొనడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించింది (INDIA Bloc Rally).


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ సభకు అధ్యక్షత వహించారు (Indian Politics 2026). రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రతిపక్షాలు తమ నిరసనను ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తం చేశాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్‌‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్

జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత

Updated Date - Nov 01 , 2026 | 05:56 PM