Share News

జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపణలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత

ABN , Publish Date - Nov 01 , 2026 | 08:41 AM

జపాన్‌లో మరోసారి భారీ భూప్రకంపణలు కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం షిమా ప్రాంతానికి సమీపంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం వేళ భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపణలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత
Japan Earthquake

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో ఆదివారం (నవంబర్ 1) ఉదయం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 7:15 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. జపాన్‌లోని మియే ప్రిఫెక్చర్ పరిధిలో ఉన్న షిమా ప్రాంతానికి దక్షిణ-ఆగ్నేయ దిశగా సుమారు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.


జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని కొన్ని ప్రాంతాల్లో జపాన్ ఏడు స్థాయిల భూకంప తీవ్రత ప్రమాణంలో మూడో స్థాయి ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు. అలాగే భూకంపం అనంతరం సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై అధికారుల నుంచి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

షిమా ప్రాంతానికి సమీపంలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం, సునామీ హెచ్చరికలు లేకపోయినప్పటికీ.. తదుపరి ప్రకంపనలు సంభవించే అవకాశాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Nov 01 , 2026 | 09:07 AM