పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!
ABN , Publish Date - Oct 31 , 2026 | 09:10 AM
పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. హాంకాంగ్ సిక్సెస్ 2026లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై ఆయన స్పందించడమే ఆ ట్రోలింగ్‌కు కారణం.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. హాంకాంగ్ సిక్సెస్ 2026లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై ఆయన స్పందించడమే ఆ ట్రోలింగ్‌కు కారణం. ఇంత చిన్న టోర్నీలో గెలిచిన పాక్ జట్టుకు అభినందనలు తెలుపుతూ షరీఫ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆయన అత్యుత్సాహంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
శుక్రవారం జరిగిన హాంకాంగ్ సిక్సెస్ 2026 మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ స్పందిస్తూ.. ‘భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించిన పాక్ జట్టుకు అభినందనలు. ఇది మంచి క్రికెట్ మ్యాచ్. ఆటగాళ్లకు అవసరమైన సహకారం అందిస్తూ, వారిని సిద్ధం చేసిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఆయన బృందాన్ని కూడా అభినందిస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. హాంకాంగ్ సిక్సెస్ వంటి చిన్న ఫార్మాట్ టోర్నీలో సాధించిన విజయానికి దేశ ప్రధాని స్థాయిలో అభినందనలు తెలపడం ఏమిటంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు..
హాంకాంగ్ సిక్సెస్ మ్యాచ్ కోసం కూడా ప్రధాని పోస్టు పెడుతున్నారా?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ గెలిచినట్లుగా అభినందనలు చెప్పడమేంటి?
ఈ టోర్నీ గురించి తెలుసుకోవడానికి నేను గూగుల్‌లో సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇంత పెద్ద విజయం సాధించినందుకు వారం రోజులు సెలవులు ప్రకటించండి అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మా అమ్మ సూచనతోనే 45.. జెర్సీ వెనుక అసలు కథ వెల్లడించిన రోహిత్ శర్మ!
అభిషేక్, ఇషాన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి తీసుకోవాల్సిందే: యువరాజ్ సింగ్