Share News

మా అమ్మ సూచనతోనే 45.. జెర్సీ వెనుక అసలు కథ వెల్లడించిన రోహిత్ శర్మ!

ABN , Publish Date - Oct 31 , 2026 | 08:03 AM

టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరు వినగానే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది 45 నంబర్ జెర్సీ. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన జెర్సీ నంబర్ వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించాడు.

మా అమ్మ సూచనతోనే 45.. జెర్సీ వెనుక అసలు కథ వెల్లడించిన రోహిత్ శర్మ!
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరు వినగానే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది 45 నంబర్ జెర్సీ. మైదానంలో 45 నంబర్‌తో బరిలోకి దిగే రోహిత్.. తన బ్యాటింగ్‌తో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే ఈ జెర్సీ నంబర్‌ను ఎంచుకోవడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందట. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన జెర్సీ నంబర్ వెనుక ఉన్న అసలు విషయాన్ని వెల్లడించాడు.


‘నాకు సింగిల్ డిజిట్ అంటే ఇష్టం. కానీ అప్పటికే 5, 8, 9 వంటి నంబర్లను ఇతర ఆటగాళ్లు తీసుకున్నారు. దీంతో చివరగా 19 నంబర్ మాత్రమే మిగిలింది. అది నాకూ నచ్చడంతో అండర్-19 క్రికెట్‌లోనూ 19 నంబర్ జెర్సీతోనే ఆడాను. అండర్-19లో 19 నంబర్‌తో ఆడొచ్చు. కానీ భారత జట్టుకు ఎంపికైతే ఆ నంబర్ తీసుకోలేవు. అది రాహుల్ ద్రవిడ్ నంబర్ అని ఓ ప్లేయర్ నాతో చెప్పాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ భారత జట్టు కెప్టెన్‌గా 19 నంబర్ జెర్సీతో ఆడుతున్నాడు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన నంబర్‌ను వదులుకోవాల్సి వచ్చింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.


తల్లి సూచనతో 45..

‘19 నంబర్ తనకు దక్కదని తెలియడంతో రోహిత్ వెంటనే తల్లికి ఫోన్ చేశా. ‘అమ్మా.. ఈ నంబర్‌తో ఆడలేనట. ఇప్పుడు నేను ఏ నంబర్ ఎంచుకోవాలి? నువ్వే చెప్పు’ అని అడిగా. 9 నంబర్‌తో ఆడాలని సూచించింది. కానీ ఆ జెర్సీ అప్పటికే మరో ప్లేయర్ తీసుకున్నాడు. నాకు 4, 5 పక్కపక్కన ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. అమ్మకు కూడా అదే చెప్పాను. ఎందుకంటే 4, 5 కలిపితే 9 అవుతుంది. పైగా జెర్సీపై కూడా ఆ నంబర్ చూడటానికి బాగుంటుంది’ అని రోహిత్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా..!

కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!

Updated Date - Oct 31 , 2026 | 08:12 AM