కివీస్‌తో నాలుగో టీ20: ఫిలిప్స్ సూపర్ సెంచరీ.. భారత్ ముందు భారీ టార్గెట్!
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:30 PM
ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు నాలుగో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆక్లాండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు నాలుగో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు సాధించింది. భారత్‌కు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్(107; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. మరో బ్యాటర్ బ్రేస్‌వెల్(65; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 40 బంతుల్లోనే 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఫిన్ అలెన్(31), మిచెల్(24) పర్వాలేదనిపించారు. సీఫర్ట్(3), జాకబ్స్(7), శాంట్నర్(5) విఫలమయ్యారు. స్మిత్(6*), మిల్నే(1*) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
హాంకాంగ్ సిక్సెస్: భారత్ చిత్తు.. పాకిస్థాన్ ఘన విజయం
కాలుష్య రహిత దీపావళి.. కోహ్లీతో ప్రచారం చేయించండి: సుప్రీంకోర్టు