హాంకాంగ్ సిక్సెస్: భారత్ చిత్తు.. పాకిస్థాన్ ఘన విజయం
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:20 PM
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తీవ్రంగా విఫలమయ్యారు. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో 89 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన పాకిస్థాన్.. 3.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఆరు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. శశాంక్ సింగ్(40; 11 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రాహుల్ త్రిపాఠి(9), నితీశ్ రాణా(19), కెప్టెన్ కృనాల్ పాండ్య(0), రాహుల్ తెవాటియా(0) విఫలమయ్యారు. దీంతో భారత్ 5 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేసింది. ఈ టోర్నీలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
89 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా అబ్బాస్ అఫ్రిది(35; 8 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లు) తొలి ఓవర్‌లోనే కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో పాక్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం రెండు ఓవర్లలోనే జట్టు స్కోరు 59 పరుగులకు చేరింది. ఆ తర్వాత ఖవాజా నఫే(41) వేగంగా పరుగులు సాధించడంతో పాకిస్థాన్ 3.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ యూఏఈ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. అయితే భారత్‌పై విజయం సాధించి తిరిగి పోటీలో నిలిచింది. మూడు రోజుల వ్యవధిలోనే ముగియనున్న ఈ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో గ్రూప్ విజేతలు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నవంబర్ 1న మాంగ్‌కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు