ప్రయోగాలకు వేళాయె!
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:43 AM
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీ్‌సను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న టీమిండియా ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటర్ల దూకుడుతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన శ్రేయాస్ సేన ఆతిథ్య జట్టును...
నేడు నాలుగో టీ20
మధ్యాహ్నం 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో...
రేసులో కుల్దీప్, వరుణ్, దూబే
జోష్‌లో టీమిండియా
పరువు కోసం కివీస్ ఆరాటం
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే ఖాతాలో వేసుకున్న టీమిండియా ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటర్ల దూకుడుతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన శ్రేయాస్ సేన ఆతిథ్య జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. తాజాగా శుక్రవారం ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరుగనుంది. త్వరలో వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో భారత తుది జట్టులో పలువురికి విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటిదాకా బరిలోకి దిగలేదు. వాస్తవానికి రెండు నెలలుగా ఈ ఇద్దరు స్పిన్నర్లు జట్టులో అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు. కివీస్ గడ్డపై భారీ స్కోర్లు నమోదు అవుతుండడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఎనిమిదో నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ వైపు మొగ్గు చూపింది. ఈ వ్యూహం మెరుగైన ఫలితాలనివ్వడంతో భారత్ 3-0తో పైచేయి సాధించగలిగింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేనందున భారత జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేయాలనుకుంటోంది. గత ఆరు నెలలుగా వరుణ్ ఫామ్‌లో నిలకడ లోపిస్తున్నా.. కుల్దీప్ మాత్రం మధ్య ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యాన్ని చాటుకున్నాడు. స్వదేశంలో విండీ్‌సతో జరిగిన టీ20 సిరీ్‌సలో తను రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ కివీస్ గడ్డపై పూర్తిగా బెంచీకే పరిమితమయ్యాడు. ఇక వెటరన్ పేసర్ భువనేశ్వర్ చివరి మ్యాచ్‌లో వికెట్ తీయకపోయినా డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రభావం చూపాడు. అయితే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 72 బంతుల్లో 139 పరుగులిచ్చుకోవడం ఆందోళనకరం. అలాగే పేసర్ మయాంక్ తొలి మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ప్రిన్స్ లేదా అర్ష్‌దీప్ స్థానంలో అతడిని కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆల్‌రౌండర్ నితీశ్‌కు విశ్రాంతినిచ్చి శివమ్ దూబేకు క్రీజులో సమయం ఇవ్వాలనుకుంటున్నారు. ఇషాన్ కిషన్ ఫిట్‌నె్‌సపై స్పష్టత లేకున్నా..తను గురువారం ప్రాక్టీస్ కొనసాగించాడు. ఒకవేళ అతను జట్టులోకి వస్తే వైభవ్‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఓపెనర్లుగా అభిషేక్, శాంసన్ బరిలోకి దిగుతారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ భీకర ఫామ్‌లో ఉన్నందున న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మనోళ్లు గత మ్యాచ్‌లో 13.2 ఓవర్లలోనే 199 పరుగులను ఛేదించగలిగారు. ఇక చిన్న బౌండరీలు కలిగిన ఈడెన్‌లో పరుగుల జోరు ఎలా ఉండనుందో వేచిచూడాల్సిందే.
ఫెర్గూసన్ అవుట్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన సిరీస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు పేసర్ ఫెర్గూసన్ దూరమయ్యాడు. మ్యాట్ హెన్రీ కూడా లేకపోవడంతో బౌలింగ్ మరింత బలహీనంగా కనిపిస్తోంది. భారత టాపార్డర్‌ను ఎలా కట్టడి చేయాలనేది వీరికి సమస్యగా మారింది. కెప్టెన్ శాంట్నర్ తన స్పిన్‌తో ప్రత్యర్థిని ఇబ్బందిపెడుతున్నా అతడికి సహకారం కరువైంది. టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ కూడా స్థాయికి తగ్గట్టు రాణిస్తేనే తొలి విజయంపై కివీస్ ఆశలు పెట్టుకోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, వైభవ్/ఇషాన్, శాంసన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, నమన్, నితీశ్/శివమ్ దూబే, అక్షర్/కుల్దీ్‌ప/వరుణ్, భువనేశ్వర్, ప్రిన్స్/మయాంక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: ఆలెన్, సైఫర్ట్, మిచెల్, ఫిలిప్స్, జాకబ్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), మిల్నే, డఫీ, ఫిషర్, స్మిత్.
పిచ్
ఇక్కడి ఈడెన్ పార్క్‌లో స్ట్రెయిట్ బౌండరీ లైన్ చిన్నదిగా ఉంటుంది. 2018లో ఆసీస్ 244 పరుగులను కూడా ఛేదించింది. అలాగే మైదానం కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉండడం వల్ల ఫీల్డింగ్ ఏర్పాటు చేయడం సవాల్ కానుంది.
ఇవి కూడా చదవండి:
డబ్ల్యూపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. మైదానంలో రికార్డుల మోత..
28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు