28 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. ఇకపై ఐటీ రంగంలో కొత్త బాధ్యతలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 06:30 PM
ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ 28 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా 28 ఏళ్ల వయసు అంటే.. క్రికెట్‌లో యాక్టీవ్‌గాఉంటారు. అంతేకాక పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటారు. కొందరు మాత్రం క్రికెట్‌కు వీడ్కోలు చెబుతుంటారు. ఆ కోవాకు చెందిన ఆటగాడే ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్. అతడు 28 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇకపై పర్సోనియో అనే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థ కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
'ఐర్లాండ్ తరఫున ఆడటం ఎంతో గర్వంగా ఉంది. అలానే మూడు ఫార్మాట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, మూడు టీ20 ప్రపంచకప్‌ల్లో జట్టుతో కలిసి ఉండటం నా జీవితంలో మర్చిపోలేను. క్రికెట్ ద్వారా ఎన్నో జ్ఞాపకాలు, పాఠాలు, జీవితకాల స్నేహాలు లభించాయి' అని తన లింక్డ్‌ఇన్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఇక బెన్ వైట్ క్రికెట్ కెరీర విషయానికి వస్తే... అతడు 2021 జూలైలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఐర్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 43 మ్యాచ్‌లు ఆడాడు. గతేడాది డిసెంబర్‌లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. వైట్ ఎక్కువగా టీ20 ఫార్మట్‌లోనే రాణించాడు. 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు సాధించాడు. 2021, 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ల్లో ఐర్లాండ్ జట్టులో స్థానం సంపాదించాడు. 2023లో రెండు వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు అరంగేట్రంలో మూడు వికెట్లు తీసుకున్న అతడు.. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ మాత్రమే తీసి.. ఏకంగా 322 పరుగులు సమర్పించుకున్నాడు.
బెన్ వైట్ రిటర్మైంట్‌పై ఐర్లాండ్ ప్రధాన కోచ్ గ్యారీ విల్సన్ స్పందించాడు. 'బెన్ అన్ని ఫార్మాట్లలో ఆడినప్పటికీ, అతడు టీ20 క్రికెట్ ద్వారానే ఎక్కువగా గుర్తింపు సంపాదించాడు. బౌన్స్ రాబట్టగల అతడి సామర్థ్యం, గొప్ప వేగంతో బౌలింగ్ చేయడం ప్రత్యర్థులకు సవాలుగా మార్చాయి. మూడు టీ20 ప్రపంచ కప్ జట్లలో చోటు దక్కించుకోవడం అతడి ప్రతిభకు నిదర్శనం' అని విల్సన్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు
న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. భారత్‌తో చివరి రెండు టీ20లకు స్టార్ బౌలర్లు దూరం..
హార్దిక్ కోసం 5 ఐపీఎల్ జట్లు.. కెప్టెన్సీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు..