Share News

తెలంగాణలో డేటా సెంటర్లకు ప్రత్యేక అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలు జారీ

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:55 PM

రాష్ట్రంలోని డేటా సెంటర్లకు ప్రత్యేక అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. డేటా సెంటర్లలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైర్ ఎన్‌ఓసీ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి కొత్త నిబంధనలు విధించింది.

తెలంగాణలో డేటా సెంటర్లకు ప్రత్యేక అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలు జారీ
Telangana Data Centres

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డేటా సెంటర్లకు ప్రత్యేక అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది. డేటా సెంటర్లలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైర్ ఎన్‌ఓసీ దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి కొత్త నిబంధనలు విధించింది. నవంబర్ 6వ తేదీ నుంచి సమర్పించే తాత్కాలిక ఫైర్ ఎన్‌ఓసీ దరఖాస్తులకు కొత్త మార్గదర్శకాలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. సర్వర్లు, బ్యాటరీలు, యూపీఎస్, ట్రాన్స్‌ఫార్మర్ల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. డేటా సెంటర్లలో ఫైర్ అలారాలు, అగ్నిమాపక వ్యవస్థలు తప్పనిసరి చేసింది.


టెక్నికల్ విభాగాల్లో వాటర్ మిస్ట్ లేదా క్లీన్ ఏజెంట్ గ్యాస్ ఫైర్ సప్రెషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిప్రమాద వ్యాప్తిని అడ్డుకునే విభజనలు, అత్యవసర మార్గాలు, అగ్నిమాపక నీటి నిల్వలు తప్పనిసరి చేసింది. మండే స్వభావం ఉన్న ప్యాకింగ్ సామగ్రి, వ్యర్థాలు పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను భవన నిర్వహణ, అత్యవసర స్పందన వ్యవస్థలతో అనుసంధానం చేయాలని సూచించింది. భద్రతతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. కీలక డిజిటల్, మౌలిక సదుపాయాల రక్షణ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతే లక్ష్యమని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య రావద్దు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఏఐ వినియోగ లక్ష్యం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 06:18 PM