Home » Telangana Govt
డిసెంబర్ మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ ద్వారా బుధవారం 713 కోట్ల రూపాయల బిల్లులు విడుదల అయ్యాయి.
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో వెయ్యి మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ విస్తరణ, వార్డుల డీలిమిటేషన్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. వార్డుల విభజనపై దాఖలైన 80కి పైగా పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్ కోటా విద్యార్థుల నుంచి హాస్టల్, మెస్ పేరుతో అదనపు ఫీజుల వసూళ్లపై నిఘా పెంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులు, యాజమాన్యాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గ్లోబల్ హబ్‌గా మారాలంటే విద్యుత్ చాలా కీలకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మనిషి మనుగడ, వ్యవస్థ మనుగడకు విద్యుత్ ఎంతో ముఖ్యమని... విద్యుత్ ప్రాథమిక అవసరంగా మారిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
సింగూరు డ్యాంను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాంను పూర్తిగా ఖాళీ చేసి మరమ్మతులు చేపట్టాలా లేక కాపర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయంలో ప్రత్యక్షంగా కమిటీ పరిశీలన చేసింది.
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వరదల కారణంగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ క్రమంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాల కోసం ప్రభుత్వం తక్షణ సాయం కింద నిధులను విడుదల చేసింది.
ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ తదితర ఏర్పాట్లును అధికారులు పరిశీలిస్తున్నారు.