Government Releases Pending Bills: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నిధులు విడుదల
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:32 PM
డిసెంబర్ మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ ద్వారా బుధవారం 713 కోట్ల రూపాయల బిల్లులు విడుదల అయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం 713 కోట్ల రూపాయలు విడుదల చేసింది. డిసెంబర్ మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ ద్వారా బుధవారం 713 కోట్ల రూపాయల బిల్లులు విడుదల అయ్యాయి. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
జూన్ నెలాఖరులో183 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆగస్టు నుంచి ప్రతినెల కనీసం 700 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తోంది. విడుదలైన బిల్లుల్లో గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్, అడ్వాన్స్‌లు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది టాప్‌లో నిలిచిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు
శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ