Draksharamam Incident: శివలింగం ధ్వంసం ఘటన.. నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందో చెప్పిన ఎస్పీ
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:58 PM
ఏపీలో సంచలనం సృష్టించిన శివలింగం ధ్వంసం కేసును 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు.
అమలాపురం, డిసెంబర్ 31: ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే కేసును చేధించి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణమని తెలిపారు. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివలింగం ధ్వంసం కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శీలం శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామన్నారు.
ఇంటి వద్ద ఆలయ ఉద్యోగులతో పంట కాలువ స్థలం వివాదం నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని వెల్లడించారు. ఆలయ పూజారి శివలింగానికి పూజ చేయడం చూసి రాత్రి ఒంటిగంట సమయంలో శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కేసు పూజారి మీదకు వెళుతుందని పక్కా ప్రణాళికతో నిందితుడు శివలింగాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు. శ్రీనివాస్‌కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులకు ఎస్పీ రాహుల్ మీనా రివార్డులు అందజేశారు.
ఇవి కూడా చదివండి...
జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త
Read Latest AP News And Telugu News